ఈసారి ఖర్చు ప్రియుడిదే

నయనతార, విఘ్నేష్ శివన్ సహజీవనం కొత్తగా చెప్పేదేముంది. అది అందరికీ తెలిసిన మేటరే. తాము ఒక జంట అనే విషయాన్ని విషయాన్ని ఈ జంట సక్సెస్ ఫుల్ గా జనాలకు మెసేజ్‌ని ఫార్వర్డ్ చేయగలిగింది. వారు భార్యభర్తలా, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా, కేవలం సహజీవనం చేస్తున్న మాడ్రన్ కపులా, అన్న వాదాలు పనిలేని మనకి సంబంధించిన విషయాలు. వారికి వారి విషయంలో ఫుల్లు క్లారిటీ ఉందట. ఐతే కలిసి ఉంటున్న తర్వాత తొలిసారిగా నయనతారకు సంబంధించిన అకేషన్ ను విఘ్నేష్ సెలబ్రేట్ చేశాడు.
అవును.. నిన్న నయన్ పుట్టినరోజు. ఈ పుట్టినరోజును విఘ్నేష్ స్వయంగా సెలబ్రేట్ చేశాడు. ఆమె కోసం తన సొంత ఖర్చుతో పార్టీ ఏర్పాట్లు చేశాడు. అంతేకాదు, కేక్ కటింగ్ పూర్తయిన వెంటనే ఆమెకు దాదాపు లక్షన్నర రూపాయల ఖరీదైన గిఫ్ట్ కూడా అందించాడు. వీళ్లిద్దరి మధ్య ఇలాంటి సంబరాలు, బహుమతులు కొత్తకాదు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఇది విఘ్నేష్ స్పాన్సర్ చేసిన సెలబ్రేషన్.
వీళ్లిద్దరూ కలిసి ఇప్పటికే మూడు సార్లు ఫారిన్ ట్రిప్ కు వెళ్లారు. ప్రతిసారి ఖర్చు నయనతారదే. అంతేకాదు, లాస్ట్ ఇయర్ విఘ్నేష్ బర్త్ డే ను ఏకంగా కాలిఫోర్నియాలో సెలబ్రేట్ చేసింది నయనతార. ఈసారి విఘ్నేష్ వంతొచ్చింది. అందుకే తన స్థాయిలో ఇలా నయన్ పుట్టినరోజును సెలబ్రేట్ చేశాడు.
- Log in to post comments