హాట్‌గా 39వ పుట్టిన రోజు
Submitted by tc editor on Tue, 2019-01-22 23:43
Kim Sharma rings in 39th birthday
Tuesday, January 22, 2019 - 21:45

కిమ్ శర్మ గురించి కొత్త తరానికి అంతగా తెలియకపోవచ్చు కానీ ఒక దశాబ్దం కిందట ఆమె వెరీ పాపులర్. సెక్సీ తారగా అప్పట్లో కుర్రాళ్ల హార్ట్‌బీట్ పెంచింది. ఇపుడు ఆమెకి 39 ఏళ్లు అంటే నమ్మలేం. ఆ రేంజ్‌లో ఉంటుంది ఆమె శరీర సౌష్టవం. జనవరి 21 ఆమె పుట్టిన రోజు. 39వ బర్త్‌డే సందర్భంగా కిమ్ శర్మ ఈ బికినీ ఫోటోని షేర్ చేసి..తన ఆనందాన్ని పంచుకొంది. తెలుగు యువ హీరో హర్షవర్ధన్ రానేతో ఆమె డేటింగ్ చేస్తోందిపుడు. వయసులో ఆమె కన్నా చిన్నవాడు. ఐతే అతను నా లవ్ అంటూ మూడు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోని అప్‌డేట్ చేసింది. ఇపుడు బర్త్‌డే సందర్భంగా ఈ ఫోటోతో ఇన్‌స్టాగ్రామ్‌ని హీటెక్కించింది.
తెలుగులో ఆమె కృష్ణవంశీ తీసిన "ఖడ్గం" వంటి సినిమాల్లో నటించింది.
- Log in to post comments