25వ సినిమాకి 25 ఫిక్స్

మహేష్‌బాబు నటిస్తున్న 25వ చిత్రం..మహర్షి. మహేష్‌బాబుకిది ప్రిస్టిజియేస్ మూవీ. 25వ సినిమాకి రిలీజ్ డేట్‌ని పక్కాగా ఫిక్స్ చేశాడు నిర్మాత దిల్‌రాజు. ఏప్రిల్ 25నే విడుదల అవుతుందని మరోసారి ప్రకటించాడు. ఇదే ఫైనల్ డేట్ అని చెప్పాడు.
మొదట మహర్షికి ఏప్రిల్ 5 అని డేట్ ఫిక్స్ చేశారు. ఐతే షూటింగ్‌లో జాప్యం జరిగింది. దాంతో తేదీ మారింది. మార్చి కల్లా మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 25న విడుదల చేస్తున్నాం. అని దిల్ రాజు వివరించారు.
వంశీపైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో మహేష్‌బాబు ఒక ఎంటర్‌ప్రూన్యర్‌గా, ఒక స్టూడెంట్‌గా, ఒక రైతుల పక్షాన పోరాడే నాయకుడిగా కనిపిస్తాడు. మూడు వేర్వేరు దశల్లో ఇలా అగుపిస్తాడు. పూజా హెగ్డే మహేష్‌బాబు సరసన నటిస్తోంది. మహేష్‌బాబు మిత్రుడిగా, సినిమా గతిని మార్చే పాత్రలో అల్లరి నరేష్ దర్శనమిస్తాడు. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మొదటి పాట మార్చి చివర్లో విడుదల అయ్యే అవకాశం ఉంది.
- Log in to post comments