ఘనంగా సౌందర్య రజనీకాంత్ పెళ్లి
Submitted by tc editor on Mon, 2019-02-11 13:50
Soundarya Rajinikanth weds Vishagan
Monday, February 11, 2019 - 13:45

సూపర్ స్టార్ రజినీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజినీకాంత్ పెళ్లి చేసుకొంది. తమిళ వర్ధమాన నటుడు, వ్యాపారవేత్త విశాగన్ని సౌందర్య వివాహమాడింది. చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో సోమవారం ఉదయం 10 గంటలకి సౌందర్య, విశాగన్ వనగమూడి పెళ్లి వేడుక జరిగింది.
తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి స్వామి వధూవరులను ఆశీర్వాదించారు. స్టాలిన్, కమల్ హాసన్, మోహన్‌బాబు, సుబ్బరామి రెడ్డి, ధనుష్, ప్రభు, మణిరత్నం, సుహాసిని వంటి ప్రముఖులు హాజరయ్యారు. రజనీకాంత్ పెద్ద అల్లుడు ధనుష్ అతిథులకు స్వాగతం పలికారు.
సౌందర్యకిది రెండో పెళ్లి. ఆమె మొదటి వివాహం విడాకులతో రద్దు అయింది.పెళ్లి వేడుకల్లో ఆమె తన కొడుకు వేద్‌ని పక్కన కూర్చొపెట్టుకోవడం విశేషం.
- Log in to post comments