బాల‌య్య సినిమాకి కుదిరిన ముహూర్తం

Balakrishna and Boyapati film will commence in June
Monday, April 15, 2019 - 13:00

బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో మరో సినిమా మొదలుకానుంది. ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు వచ్చే నెల 23న వస్తాయి. హిందుపూర్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన బాలయ్యకి గెలుపు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఆ నియోజకవర్గం తెలుగు దేశం పార్టీకి కంచుకోట.

బాలయ్య గెలవడం కష్టమని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఐతే ఎలాగోలా బయటపడడం గ్యారెంటీ అని పొలిటికల్ విశ్లేషకులు అంటున్నారు. అంటే.. బాలయ్య మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తాడన్నమాట. గెలిచినా... ఓడినా సినిమాలు చేయడం బాలయ్య పాలసీ. అందుకే బాలయ్య... బోయపాటిని కథ పూర్తి చేసుకోమని ఇప్పటికే చెప్పాడట.

బోయపాటి తీసిన "వినయ విధేయ రామ" అట్టర్ ఫ్లాప్ అయింది. ఇపుడు బాలయ్యతో హిట్ కొట్టి మళ్లీ తన సత్తా చాటుకోవాల్సి అవసరం పడింది బోయపాటికి. అన్ని అనుకున్నట్లు కుదిరితే జూన్ 10న ఈ సినిమాని లాంచ్ చేస్తారట. ఆ రోజు బాలయ్య బర్త్ డే.

 

|

Error

The website encountered an unexpected error. Please try again later.