కూతురి కోసమే బతుకుతున్నా

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తొలిసారి ఫుల్ లెంగ్త్ ఇంటర్వ్యూ ఇచ్చింది. నటుడు ఆలీ చేస్తున్న టీవీ షోలో ఆమె మనసు విప్పి మాట్లాడింది. అనేక విషయాలు వెల్లడించింది.
ఆమె త్వరలోనే రెండో పెళ్లి చేసుకోనుంది. కాబోయే భర్త పేరు మాత్రం బయటికి చెప్పనంటూనే అతను పూణెలో ఒక ఐటీ కంపెనీలో డైరక్టర్గా పని చేస్తున్నారని తెలిపింది. ఆయన పేరు చెప్పి ఇబ్బందుల్లో పడెయ్యను అంటోంది. ఇక ఈ రోజు తను బతికి ఉన్నాను అంటే కారణం.. తన కూతురే అని సంచలనంగా ప్రకటించింది. రేణుకి పవన్ కల్యాణ్ ద్వారా ఇద్దరు పిల్లలున్నారు. కొడుకు అకీరా నందర్. కూతురు ఆద్య.
ఆద్య కోసమే బతికి ఉన్నాను లేదంటే ఎపుడో చచ్చిపోయేదాన్ని అని కలకలం రేపింది. పవన్ కల్యాణ్ అభిమానులు వదిన అంటూ తనని సంబోధించడం వరకు ఓకే కానీ నేను ఎలా ఉండాలో, ఏమి చేయాలో చెప్పినపుడే కోపం వస్తుందని తెలిపింది రేణు.
- Log in to post comments