కమల్ బిగ్‌బాస్3కి డేట్ కుదిరింది
Submitted by tc editor on Thu, 2019-05-30 18:14
Bigg Boss 3 Tamil sets its telecast date
Thursday, May 30, 2019 - 15:15

జూన్ 23 నుంచి తమిళంలో కమల్ బిగ్ బాస్ కొత్త సీజన్‌ని మొదలుపెట్టనున్నాడు. మూడో సీజన్ జూన్ 23న ప్రారంభం అంటూ కమల్ ఫోటోలతో చేసిన కొత్త పోస్టర్స్ బిగ్ బాస్ టీమ్ విడుదల చేసింది. కమల్ హాసన్ స్థానంలో నయనతార బిగ్ బాస్ యాంకర్ గా చేస్తుందన్న వార్తలకి బంద్ పడింది ఇక.
తమిళంలో కూడా బిగ్ బాస్ కార్యక్రమం సూపర్ హిట్టయింది. తమిళ బిగ్ బాస్ మొదటి సీజన్, రెండో సీజన్...రెండింటిని కమల్ హాసన్ హోస్ట్ చేశాడు. మూడో సీజన్ కీ ఆయనే. తెలుగులో మొదటి సీజన్ ని ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, రెండో సీజన్ కి నాని వచ్చాడు. ఇక ఇపుడు మూడో సీజన్ కి నాగార్జున బిగ్ బాస్‌గా రానున్నాడు. కానీ ఇంకా నాగార్జున పేరుని అఫీషియల్‌గా ప్రకటించలేదు.
తెలుగులో బిగ్ బాస్ మూడో సీజన్ జులైలో మొదలు కానుంది.
- Log in to post comments