మిస్ మ్యాచ్ అంద‌రికీ న‌చ్చుతుంది!

Miss Match completes shoot
Tuesday, July 2, 2019 - 17:45

ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా త‌మిళ చిత్రాల భామ‌) హీరోయిన్‌గా మిస్ మ్యాచ్' పేరుతొ ఓ చిత్రం రూపొందుతోంది. విజయ్ ఆంటోని 'సలీం' వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. 

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొంది.

హీరో ఉదయ్ శంకర్ : "చిత్ర కథను భూపతిరాజ గారు ఇచ్చారు. మంచి కథలు వింటున్న సమయంలో ఈ కథ నాకు రావడం అదృష్టం. దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన విధానం సినిమాకు ప్లస్. త్వరలో చిత్రం  విడుదల డేట్ ను ప్రకటిస్తాము. ప్రదీప్ రావత్, శరణ్య వంటి మంచి నటీనటులు ఈ సినిమాలో చెయ్యడం జరిగింది."

"నా పాత్ర ఈ సినిమాలో కొత్తగా ఉంటుంది. రఫ్ రోల్ లో మీముందుకు వస్తున్నాను. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. పవన్ కళ్యాణ్ గారి  తొలిప్రేమ సినిమాలోని ఒక పాటను ఈ సినిమాలో రీమిక్స్ చేసాం. తప్పకుండా ఆ పాట మీ అందరికి నచ్చుతుంది," అన్నారు హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ 

నిర్మాత భరత్ రామ్ మాట్లాడుతూ... "ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ చాలా బాగా నటించారు. హీరోయిన్ ఒక స్పోర్ట్స్ నేపధ్యంగా ఉన్న పాత్రలో నటించింది. ఛాలెంజింగ్ రోల్ లో నటించింది. గిఫ్టన్ ఇలియాస్ సంగీతం నేపధ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి" అన్నారు.

|

Error

The website encountered an unexpected error. Please try again later.