రానాకి అమెరికాలో చికిత్స నిజమే

రానా గత ఏడాదిన్నర కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. తాజాగా ఈ వ్యాధికి శాశ్వత చికిత్స కోసం అమెరికా వెళ్లాడు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలా లేక వేరే విధంగా నయం చేయవచ్చా అనేది ఈ వారంలో అక్కడి నెఫ్రాలిజిస్ట్ డిసైడ్ చేస్తారు. గత వారమే రానాతో పాటు రానా తండ్రి సురేష్‌బాబు, తల్లి లక్ష్మీ సహా అందరూ అమెరికా వెళ్లారు. చికిత్స కోసమే రానా అక్కడున్నది నిజమే.
ఐతే.. నిజంగానే ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమా లేదా అనేది ఇపుడు చెప్పలేమట. అతని హెల్త్ గురించి అనేక పుకార్లు వచ్చాయి. ఐతే... సోడియం లెవల్స్‌కి సంబంధించిన సమస్యతో ఇబ్బందిపడుతున్నట్లు గతంలో సోషల్ మీడియాలో రానా రాసుకున్నాడు. రానా త్వరగా కోలుకొని హైదరాబాద్ రావాలని కోరుకుందాం.
గతేడాది కాలంగా రానా ఈ వ్యాధితో పోరాటం చేస్తున్నాడు. ఇంత తీవ్రమైన సమస్య ఉన్నా... షూటింగ్‌లు మానలేదు. నిత్యం బిజీగానే ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ విషయంలో రానా ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం.
- Log in to post comments