ఆ సినిమాపై ఎవరూ నోరు మెదపరేంటి?

Why Hero has been stalled?
Saturday, July 27, 2019 - 15:30

డియర్ కామ్రేడ్ రిలీజైంది. విజయ్ దేవరకొండ చేతిలో ఇంకా చాలా సినిమాలున్నాయి. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామళైతో హీరో అనే సినిమా చేస్తున్నాడు ఈ హీరో. మరోవైపు క్రాంతిమాధవ్ దర్శకత్వంలో సినిమా కూడా సెట్స్ పై ఉంది. వీటితో పాటు లిస్ట్ లో పూరి జగన్నాధ్, పరశురాం, శివ నిర్వాణ లాంటి దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అంతా బాగానే ఉంది హీరో సినిమా పరిస్థితేంటి?

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఆగిపోవడం అంటే డియర్ కామ్రేడ్ రిలీజ్ వల్ల షూటింగ్ ఆగిపోవడం కాదు. మొత్తంగా సినిమానే పక్కనపెట్టినట్టు టాక్. అవును.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే 5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఢిల్లీలో భారీఎత్తున రేసింగ్ సన్నివేశాలు తీశారు.

  
కానీ కోట్లు ఖర్చుపెట్టి తీసిన ఆ సన్నివేశాలు ఆశించిన స్థాయిలో రాలేదట. దీంతో ఆనంద్ అన్నామళై దర్శకత్వంపై అందరికీ అనుమానాలు పెరిగిపోయాయి. ఇప్పటికే 5 కోట్లు ఆవిరి అయిపోయాయి. ఇంకా ఈ దర్శకుడ్ని నమ్ముకొని సినిమాకు మరిన్ని కోట్లు ఖర్చుపెట్టడం అవివేకం అని భావిస్తోంది యూనిట్. అందుకే అంతా మాట్లాడుకొని ఈ సినిమాను పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. డియర్ కామ్రేడ్ మేనియా ముగిసిన తర్వాత విజయ్ దేవరకొండ దీనిపై ఓ ప్రకటన చేయబోతున్నాడు. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.