కాజల్ ని అస్సలు అప్రోచ్ అవ్వలేదంట

Kajal not approached for Koratala Siva movie
Monday, July 29, 2019 - 15:00

మెగాస్టార్ చిరంజీవి - కొరటాల కాంబినేషన్లో సినిమా ఇంకా మొదలు కాలేదు. సెప్టెంబర్లో లాంఛనంగా సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. ఐతే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న విషయంలో రోజుకో వార్త పుట్టుకొస్తోంది. మొదట శ్రుతి అని, ఆ తర్వాత ఐశ్వర్యారాయ్ అని... ఇలా డైలీ ఎపిసోడ్లో తాజాగా కాజల్ అగర్వాల్ పేరుని మీడియా ప్రచురించింది.

ఇదే విషయాన్ని కొరటాల టీమ్ ముందు పెడితే...అస్సలు కాజల్ అగర్వాల్ గురించి తాము ఆలోచించనే లేదని, ఆమెని అప్రోచ్ కాలేదని స్పష్టం చేసింది. కాజల్ ఈ పాత్రకి సూట్ అయ్యే అవకాశం తక్కువట. అందుకే ఇప్పటికీ కొరటాల టీమ్ అనుష్క, నయనతారలలో ఒకరిని ఫైనల్ చేయాలని భావిస్తోంది.

ఐశ్వర్యారాయ్ అనేది ఫర్ పెక్ట్ చాయిస్ అవుతుందనేది నిజమే కానీ ఆమెని ఒప్పించడం కొంచెం కష్టం. ఆమెకి ఇవ్వాల్సిన పారితోషికం కూడా చాలా ఎక్కువ. అందుకే, అనుష్క, నయనతారలలో ఒకరిని ఒప్పించే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ నుంచి మొదలవుతుంది. ఉగాదికి రిలీజ్ 
చెయ్యాలి అనేది ప్లాన్. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.