విజయశాంతి సోషల్ మీడియా పాలిటిక్స్

Vijayashanti fires on KCR from social media platform
Wednesday, July 31, 2019 - 22:15

"ఈ రాష్ట్రానికి ఏమైంది. ఒకవైపు అప్పులు..మరోవైపు బకాయిలు... " అంటూ విజయశాంతి ఉన్నట్టుండి ట్విట్టర్ వేదికపై పంచులు విసిరారు. లేడీ అమితాబ్ గా పేరొందిన విజయశాంతి... మళ్లీ పొలిటికల్ యాక్టివిటీని పెంచుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవైపు మహేష్ బాబు నటిస్తోన్న "సరిలేరు నీకెవ్వరు" సినిమాలో రీఎంట్రీ ఇస్తున్న విజయశాంతి ఇపుడు రాజకీయంగానూ పంచ్ డైలాగ్ లు చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇపుడు దేశంలో రాజకీయ నేతలందరూ బీజేపీ వైపు చూపు వేస్తున్నారు. అదే లక్ష్యంతో రాములమ్మ కూడా ఉందని ఇటీవల ప్రధాన పత్రికల్లో వార్తలు - వచ్చాయి. అయితే ఆ ప్రచారాన్ని ఆమె తప్పు అని తిప్పికొట్టింది. ఉరుము లేని మెరుపులా ఆమె మళ్లీ రాజకీయ ట్వీట్లతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని టార్గెట్ చేస్తుండడంతో పుకార్లకి బలం వచ్చింది.

ఇంతకీ విజయశాంతి అసలు ప్లాన్ ఏంటో?

అనిల్ రావిపూడి డైరక్షన్లో మహేష్ నటిస్తోన్న "సరిలేరు నీకెవ్వరు"  కొత్త షెడ్యూలు ప్రారంభమయింది. విజయశాంతికి సంబంధించిన సీన్లని ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో తీస్తారట. ఈ గ్యాప్ లో ఆమె కొంత బరువు తగ్గి ఫిట్ నెస్ ని సంతరించుకునే పనిలో ఉన్నారు.

|

Error

The website encountered an unexpected error. Please try again later.