బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ ఖాయం

Bellamkonda Srinivas to debut in Bollywood?
Monday, August 5, 2019 - 16:00

బెల్లంకొండ శ్రీనివాస్ కమర్షియల్ చిత్రాల హీరో. ఇప్పటి వరకు నటించిన సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినా... బిజినెస్ పరంగా, ఓపెనింగ్స్ పరంగా అతను ప్రూవ్ చేసుకున్నాడు. ఈసారి "రాక్షసుడు" అనే రీమేక్ సినిమాతో నటుడిగానూ మంచి మార్కులు వేయించుకున్నాడు. ఈ సినిమా నుంచి అతను విక్టరీ వెంకటేష్ ఫార్మూలాని ఫాలో అవుతాడట. ఈ విషయాన్ని ఆయన తండ్రి బెల్లంకొండ సురేష్ ప్రకటించాడు. 

వెంకటేషు సాధించిన విజయాల్లో ఎక్కువగా రీమేకులే ఉన్నాయి. తమిళ సినిమాలను యాజిటీజుగా తెలుగులో తీయించేవాడు వెంకీ. తన కొడుకు కూడా ఈ సినిమా విషయంలో అలా చేసి విజయం సాధించడంటున్నారు బెల్లంకొండ సురేష్, అంతే కాదు, తన కొడుక్కి హిందీ డబ్బింగ్ మార్కెట్ బాగుంది కాబట్టి త్వరలోనే బాలీవుడ్ లో ఎంట్రీ చేయిస్తాను అంటున్నాడు. 

"మా అబ్బాయికి రాక్షసుడు మంచి పేరు తీసుకొచ్చింది. ఇంతకుముందు నటించిన సినిమాలు  తనకు ఎలాంటి పేరు తీసుకురాలేదు. రీమేక్ చిత్రాన్ని ఎక్కడా చెడగొట్టకుండా దర్శకుడు రమేష్ వర్మ తీశారు. మా అబ్బాయి నడిచిన సినిమాల్లో కొన్ని సినిమాలు తెలుగులో ఆర్థికంగా నష్టపోయినా హిందీలో మంచి వసూళ్లు రాబట్టాయి. డబ్బింగ్ మార్కెట్ లో మా అబ్బాయి నెంబర్ వన్ హీరో. అందుకే త్వరలోనే బాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాం. అలాగే నెక్స్ట్ మూవీ ఒకటి దిల్ రాజు బ్యానర్లో ఉంటుంది," అని చెప్పారు 

"మా అబ్బాయి ప్రతి సినిమాకు జర్నలిస్ట్ అసోసియేషన్ కు 10 లక్షలు ఇస్తానని ప్రకటించారు బెల్లంకొండ సురేష్. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.