సెల్‌టవర్‌ ఎక్కిన డైహార్డ్‌ ఫ్యాన్‌

A die hard fan for Prabhas
Wednesday, September 11, 2019 - 17:00

ఫ్యాన్స్.. డైహార్డ్ ఫ్యాన్స్ అంటూ సాహోలో తనదైన స్టయిల్ లో డైలాగ్ చెబుతాడు ప్రభాస్. నిజజీవితంలో అదే నిజమైంది. ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్ ఒకడు అరాచకం సృష్టించాడు. నానా హంగామా చేశాడు. ఇంతకీ అతడు ఏం చేశాడో తెలుసా? సెల్ టవర్ ఎక్కాడు. ప్రభాస్ ను కలవాల్సిందే అంటూ భీష్మించుక్కూర్చున్నాడు.

తెలంగాణలోని జనగామలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కాడు ఈ ఆకతాయి. బట్టలన్నీ విప్పేశాడు. కేవలం అండర్-వేర్ తోనే ఉన్నాడు. ప్రభాస్ వచ్చేవరకు కదిలేది లేదన్నాడు. అవసరమైతే దూకి ఛస్తానన్నాడు. ఈ మేరకు ప్రభాస్ ఫ్యాన్ అనే ట్యాగ్ లైన్ తో సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తోంది.

ఇంతకీ అతడు ప్రభాస్ ఫ్యాన్ అవునా కాదా అనేది అనుమానం. కేవలం పబ్లిసిటీ కోసమే అతడిలా చేశాడా లేక మతిస్థిమితం కోల్పోయి ప్రవర్తించాడా అనే విషయం తేలాల్సి ఉంది. మొత్తమ్మీద సాహో సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగ్ ను ఇతడు నిజం చేసి చూపించాడు. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.