తెలంగాణాలో పవన్ కళ్యాణ్ లొల్లి ఎందుకు?

Pawan Kalyan trying some hungama in Telangana
Sunday, September 15, 2019 - 17:15

మొన్న ఎన్నికల్లో ఓడిపోయినా తర్వాత పవన్ కళ్యాణ్ ఎక్కువగా హడావిడి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తెలంగాణ మీద కూడా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. చిత్రపురి కాలనీకి సంబదించిన ఒక సమస్యపై  మాట్లాడారు. ఇప్పుడు నల్లమలలో యురేనియం తవ్వకాలపై హుంగామా చేస్తున్నారు. 

పవన్ కళ్యాణ్ తెలంగాణాలో ఇప్పుడు లొల్లి చెయ్యడం వెనుక ఉన్న మర్మం ఏంటి అని తెలంగాణ వాదులు ఆరా తీస్తున్నారు. తెరాస ప్రభుత్వ వ్యతిరేక శక్తులతో పవన్ కళ్యాణ్ చేతులు కలిపాడని అనుమానం ఉందని తెరాస వర్గాలు అంటున్నాయి. అయితే, పవర్ స్టార్ లొల్లిని పెద్దగా సీరియస్ గా తీసుకోవడం లేదు. ఎందుకంటే... తనకి చాల అనుకులమైన గాజువాక, భీమవరంలోనే గెలవలేకపోయిన పవన్ కల్యాన్ ఇక్కడ పెద్దగా చూపించే ప్రభావం ఉంటుందా అని లైట్ తీసుకుంటున్నారట. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.