కథ అంతా ట్రయిలర్‌లోనే చెప్పేశారు

Story of Sye Raa revealed through trailer
Wednesday, September 18, 2019 - 19:30

సైరా సినిమా కథలో రహస్యం ఏమీ లేదు. అది ఒక నిజ జీవిత గాథ. కర్నూలు సమీపంలోని ఉయ్యాలవాడకి చెందిన నర్సింహారెడ్డి బ్రిటీష్‌ దొరలకి వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన ఒక యోధుడి కథి..సైరా. 1840 ప్రాంతంలో జరిగిన నిజమైన కథ ఇది.  ఆ కథ తెలియని వారు ఎవరు అయినా ఉంటే.. తాజాగా విడుదలైన ట్రయిలర్‌తో మొత్తం అర్థమయిపోతుంది. కథ సంక్షిప్తంగా తెలిసేలా ట్రయిలర్‌ని కట్‌ చేశారు. ఇందులో సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌ ఏమీ లేవు.

మూడు నిమిషాల పాటు సాగిన ఈ ట్రయిలర్‌ బాగుంది. దేశభక్తి రేపేలా ఉంది. సినిమాపై ఉన్న హైప్‌ మరింత పెరిగేలా  ఉంది ట్రయిలర్‌. అందులో డౌట్‌ లేదు. ఐతే నర్సింహరెడ్డి చనిపోతాడు అనే అర్థంలో ఉన్న సీన్లను యాడ్‌ చేయకుండా ఉండాల్సింది. స్టోరీ కోసం ఈ సినిమాకి ఎవరూ రారు... కథనం ఎలా ఉందనేదే మెయిన్‌ పాయింట్‌. అందుకే మేకర్స్‌ కథ మొత్తం అర్థమయ్యేలా, ఆ గ్రాండ్‌నెస్‌ జనాలికి తెలిసేలా కట్‌ చేశారు ట్రయిలర్‌.

మెగాస్టార్‌ చిరంజీవి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఇది. దర్శకుడు సురేందర్‌రెడ్డి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని హ్యండిల్‌ చేయగలడా? ఇలాంటి కథని అతను ఎలా తీయగలడు అన్న డౌట్స్‌ పటాపంచలు అయ్యేలా ఉంది ట్రయిలర్‌.

|

Error

The website encountered an unexpected error. Please try again later.