ప్రతిరోజు పండగే.. చావు, బతుకు థీమ్!

Prati Roju Pandage completes shoot
Wednesday, November 13, 2019 - 16:30

సాయి తేజ్ హీరోగా మారుతి  తీస్తున్న మూవీ... ప్రతిరోజు పండగే. బన్నీ వాస్ నిర్మాతగా తీస్తున్న ఈ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్. డిసెంబర్ 20న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తయ్యింది. ఇటీవలే కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ అమెరికాలో జరిగింది. 

మారుతి సినిమాల్లో సహజంగా .. హీరోకి ఎదో ఒక మానసిక సమస్య ఉంటుంది. ఇగో, మతిమరుపు, అతి శుభ్రత .... ఇలాంటి సమస్యల చుట్టూ సినిమా కథలను అల్లుతాడు మారుతి. ఈ సినిమాలో 'చావు' గురించి ప్రస్తావన ఉంటుందట. చచ్చిపోతామని బాధపడే కన్నా .... బతికినంత కాలం ప్రతిరోజు పండగలా బతకాలనే థీమ్ చుట్టూ కథని అల్లినట్లు సమాచారం. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.