90MLతో మంచి కిక్ వచ్చింది: అనూప్

Anup Rubens talks about 90 ML
Saturday, November 30, 2019 - 18:00

మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ రేస్ లో ఇటీవల వెనుక బడ్డాడు. ఒకప్పుడు ఒక రేంజిలో ఊపేసిన అనూప్ ...మళ్లీ 90ML సినిమాతో వార్తల్లోకి వచ్చారు. 

"నేను రెండు, మూడు మాస్ సినిమాలు చేసాను కానీ ఇది దానికి పూర్తి భిన్నంగా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. నేను రియల్ లైఫ్ లో 90 కాదు కదా ట్వంటీ కూడా తీసుకోను. మందు తాగాను. బట్ కథ కిక్ ఇచ్చింది, అని చెప్పారు అనూప్. "సంగీతంతో పాటు వైవిధ్యమైన కథ, కార్తికేయ డాన్సులు, కామెడీ ఈ చిత్రానికి బాగా ప్లస్ అవుతాయి అనుకుంటున్నాను."

"ఈమధ్య కాలంలో నేను అనుకున్నవి కొన్ని జరగలేదు, పెద్ద ప్రాజెక్ట్స్ కొన్ని అనుకున్నట్టుగా అవ్వలేదు కానీ నా చేతిలో ఏమి లేదు, సమయం వచ్చినపుడు ఏది అలా జరగాలో అది జరుగుతుంది అని నమ్ముతున్నాన, అని మిస్ అయిన సినిమాల గురించి చెప్పుకున్నారు అనూప్. 

ప్రతీ సంగీత దర్శకుడిలో ఒక స్టైల్ ఉంటుంది. మేము ఇచ్చిన ఒక 100 ట్యూన్స్ లో ఐదు ట్యూన్ లు ఎక్కడో టచ్ అవుతాయి అది కాపీ కాదు, మక్కీ కి మక్కీ దించడం తప్పు.  అలా దించడంలో అసలు మ్యూజిక్ డైరెక్టర్ ప్రతిభ ఏముంటుంది," అని కాపీ ట్యూన్ ల గురించి తన వర్సన్ చెప్పారు. 

ప్రస్తుతం ఇంకేవైనా సినిమాలు చేస్తున్నారా అని అడిగితే, "కన్నడ లో ఒక సినిమా చేస్తున్న, తెలుగులో కొన్ని డిస్కషన్ లు జరుగుతున్నాయి.హీరో నితిన్ తో చిత్రం ఉంటుంది, త్వరలోనే అనౌన్స్ చేస్తాను." అని తెలిపారు. 

 

|

Error

The website encountered an unexpected error. Please try again later.