RRR... ఒక టైటిల్ మిస్

A producer registers Rama Ravana Rajyam title
Monday, December 16, 2019 - 09:00

RRR అనే వర్కింగ్ టైటిల్ తో సినిమాను ప్రకటించారు. అదే టైటిల్ తో షూటింగ్ కూడా కొనసాగిస్తున్నారు. మరోవైపు కంటెస్ట్ కూడా పెట్టారు. RRRను విడమర్చి చెబుతూ మంచి టైటిల్ పెట్టాలని ప్రేక్షకుల్ని కోరారు. అలా వచ్చిన టైటిల్స్ నుంచి ఓ మంచి పేరును సెలక్ట్ చేస్తామని ఏడాది కిందటే ప్రకటించారు. అప్పట్లో చాలా టైటిల్స్ వచ్చాయి కూడా. అందులోంచి ఓ టైటిల్ ఇప్పుడు యూనిట్ చేజారిపోయింది.

RRRను విడమరుస్తూ ఎక్కువమంది రామరావణ రాజ్యం అనే టైటిల్ ను సజెస్ట్ చేశారు. అప్పట్లో ఒక దశలో అదే టైటిల్ ను ఫిక్స్ చేస్తారని కూడా గుసగుసలు వినిపించాయి. ఇప్పుడా టైటిల్ ను మరో నిర్మాణ సంస్థ రిజిస్టర్ చేయించుకుంది. తాజాగా ఫిలింఛాంబర్ లో నమోదైన టైటిల్స్ జాబితాలో వీ3 ఫిలిమ్స్ బ్యానర్ పై రామరావణరాజ్యం అనే టైటిల్ రిజిస్టర్ అయి ఉంది.

ఇక్కడితో ఆగలేదు వ్యవహారం. ఈ టైటిల్ తో ఓ సినిమా కూడా ప్రకటించారు. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందంటూ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. సో.. రాజమౌళి చేతి నుంచి రామరావణరాజ్యం అనే టైటిల్ చేజారినట్టే. రాజమౌళి అడిగితే ఈ టైటిల్ ను వదులుకోవడానికి తాము సిద్ధమంటున్నారు వి3 ఫిలిమ్స్ నిర్మాతలు. కానీ అది జరిగే పనేనా?

|

Error

The website encountered an unexpected error. Please try again later.