కె.జి.యఫ్‌ 2 తొలిలుక్ కి సూపర్ రెస్పాన్స్

KGF2 first look gets super response
Saturday, December 21, 2019 - 20:15

‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 1’ .... కన్నడ చిత్రసీమలో ఒక ట్రెండ్ సెట్టర్. కలెక్షన్స్‌ పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేసింది. పాన్‌ ఇండియా చిత్రంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజైంది. ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 1’కి కొనసాగింపుగా ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2‘ రూపొందుతోంది. కైకాల సత్యనారాయణ సమర్పణలో ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో విజయ్‌ కిరగందూర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం అధినేత సాయికొర్రపాటి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు.

‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 1’ విడుదలైన ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా ‘కె.జి.యఫ్‌ చాప్టర్‌ 2’ ఫస్ట్‌ లుక్‌ను శనివారం విడుదల అయింది.

ఇందులో యష్‌ డిఫరెంట్‌ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ ఫస్ట్‌ లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. బాలీవుడ్  స్టార్‌ యాక్టర్‌ సంజయ్‌ దత్‌ అధీర అనే పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల కానుంది.

|

Error

The website encountered an unexpected error. Please try again later.