ఇష్టమైన స్పాట్ కు సమంత, చైతన్య

Samantha and Naga Chaitanya to ring in New Year in Goa
Monday, December 30, 2019 - 09:15

న్యూ ఇయర్ వస్తుందంటే చాలు స్టార్స్ అంతా తలో దిక్కు చెక్కేస్తుంటారు. ఎక్కువంది విదేశాల్లో వాలిపోతే, చాలామంది మన దేశంలోనే మంచి లొకేషన్లు చూసుకొని సెటిల్ అయిపోతుంటారు. అయితే ఈ విషయంలో నాగచైతన్య-సమంతకు రెండో ఆలోచన లేదు. వాళ్లది ఎప్పుడూ ఒకటే ఛాయిస్. అదే గోవా.

సమయం దొరికితే చాలు గోవా వెళ్లి ఎంజాయ్ చేయడానికి ప్రాధాన్యమిస్తుంది ఈ జంట. గోవా అంటే వీళ్లిద్దరికీ అంత ఇష్టం. ఎంతిష్టమంటే వాళ్ల పెళ్లికి కూడా గోవానే వేదికగా సెలక్ట్ చేసుకున్నంత ఇష్టం. పెళ్లి, న్యూ ఇయర్ పార్టీలతో పాటు.. చిన్నచిన్న వెకేషన్లు కూడా గోవాలోనే ప్లాన్ చేసుకుంటుంది ఈ జంట.

ఈసారి కూడా నూతన సంవత్సరానికి స్వాగతం పలకడానికి గోవా వెళ్లారు నాగచైతన్య-సమంత. ముందుగా సమంత గోవా వెళ్లిపోయింది. ఆల్రెడీ బుక్ చేసుకున్న స్టార్ హోటల్ రిసార్ట్ లోకి చేరిపోయింది. భర్త చైతూ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న చైతూ, సమంత కంటే కాస్త ఆలస్యంగానైనా తొందరగానే గోవా చేరిపోయాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ గోవాలోనే ఎఁజాయ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ వరకు అక్కడే. ఈసారి వీళ్ల పార్టీలోకి నాగ్-అమల కూడా జాయిన్ అవుతారని టాక్.

|

Error

The website encountered an unexpected error. Please try again later.