గంగూబాయి గాయపడలేదట!

I wa not injured on Gangubai Kathiawadi sets: Alia Bhatt
Tuesday, January 21, 2020 - 13:30

అలియా భట్ వివరణ ఇచ్చేసింది. 'గంగూబాయి కతీయవాడి' అనే సినిమా షూటింగ్ లొకేషన్ లో ఆమె తీవ్రంగా గాయపడింది అని మీడియాలో వచ్చిన వార్తలపై క్లారిటీ ఇచ్చింది. "నేను గాయపడలేదు. నేను క్షేమంగా ఉన్న. నిన్న ఒక్క రోజు షూటింగ్ కి వెళ్ళలేదు. ఎందుకంటే గతంలో కాలుకి గాయమైంది. అది ఇప్పుడు కొంత తిరగబెట్టింది. సో..  వన్ డే రెస్ట్ తీసుకున్నాను. ఇంతకుమించి ఏమిలేదు," అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. 

సంజయ్ లీలా భన్సాలీ తీసున్న మూవీ ఇది. ఇందులో గంగూబాయి అనే ఒక లేడీ గ్యాంగ్ స్టర్ గా నటిస్తోంది ఆలియా. ఈ సినిమా షూటింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాక... ఆమె రాజమౌళి తీస్తున్న 'ఆర్. ఆర్. ఆర్' షూటింగ్లో పాల్గొంటుంది. అలియా ఇప్పుడు బాలీవుడ్లో మంచి పొజిషన్ లో ఉంది. చేతిలో చాలా సినిమాలున్నాయి. ఆమె రెస్ట్ తీసుకుంటే... అనేక సినిమాల డేట్స్ తారుమారు అవుతాయి.  

మన టాలీవుడ్ బిగ్ సినిమాకి కూడా ఇబ్బందే. అందుకే వెంటనే క్లారిటీ ఇచ్చింది ఈ భామ.

|

Error

The website encountered an unexpected error. Please try again later.