రాశిఖన్నాకి పేరొచ్చింది కానీ...

Raashi Khanna not getting big projects
Monday, January 27, 2020 - 15:15

మొన్న డిసెంబర్ లో రాశి ఖన్నా ఒకేసారి రెండు విజయాలు అందుకొంది. ఒకటి 'వెంకీ మామ', రెండోది 'ప్రతి రోజు పండగే'. రెండింటిలోనూ మంచి పాత్రలే పడ్డాయి. ముఖ్యంగా 'ప్రతి రోజు పండగే' లో టిక్ టాక్ వీడియోల పిచ్చి ఉన్న సుందరిగా బాగా నటించింది. 

ఇక నెక్స్ట్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ' వల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో కూడా ఆమెది సూపర్ స్ట్రాంగ్ రోల్ అంట. ఇందులో నలుగురు హీరోయిన్లు ఉన్నారు. కానీ మెయిన్ కథ మాత్రం ఆమె చుట్టే. అంతే కాదు, తొలిసారిగా గాఢమైన లిప్ టు లిప్ కిస్ సీన్లు  కూడా చేసింది. అంతే బావుంది కానీ కొత్తగా బిగ్ సినిమాలే రావడం లేదు. పెద్ద హీరోలు అందరూ హీరోయిన్ ల కోసమంటూ బాంబే వైపు చూపు వేస్తున్నారు. పూజ హెగ్డే కియారా, జాన్వీ, అనన్య పాండే... ఇలా రకరకాల ఆప్షన్లు వెతుకుతున్నారు. కానీ రాశి పేరుని పరిశీలించడం లేదు. 

నటిగా ఇప్పుడు ఇంప్రూవ్ అయింది. బరువు కూడా తగ్గింది. కానీ పెద్ద సినిమాలు, బిగ్ హీరోల సరసన రోల్స్ రావట్లేదు. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.