బిగ్ బాస్ తో గిట్టుబాటు అయినట్టుంది

Shiva Jyothi earning so much?
Thursday, February 27, 2020 - 15:45

బిగ్ బాస్ విన్నర్ రాహుల్, బెంజ్ కొనుకున్నాడంటే అర్థముంది. అతడు ఓ ఇల్లు కూడా కొనుకున్నాడంటే నమ్మొచ్చు. కానీ విన్నర్ తో పాటు అందులో పార్టిసిపెంట్లు కూడా బాగానే సొమ్ములు చేసుకున్నారు. క్రేజ్ తో పాటు మనీ కూడా బాగానే పట్టారు.

రాహుల్ ఫేక్ లవర్ పున్నూ అయితే వరుస ఫొటోషూట్లతో బిజీ అయింది. ఆమె కూడా ఓ కారు కొనుక్కుంది. 2 సినిమా ఆఫర్లు కూడా పట్టేసింది. ఇక వరుణ్ సందేష్, అతడి భార్య వితిక అయితే బిగ్ బాస్ నుంచి బయటకొచ్చిన తర్వాత తమ ఇంటికి కాస్ట్ లీ ఇంటీరియర్ (దాదాపు 2 కోట్లు అయినట్టు టాక్) చేయించుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి తీన్మార్ సావిత్రి అలియాస్ శివజ్యోతి కూడా చేరిపోయింది. ఈమె కూడా ఓ ఖరీదైన ఇల్లు తీసుకుంది.

బిగ్ బాస్ లో తనకొచ్చిన డబ్బుతో పాటు ఇతర డీల్స్ తో వచ్చిన మనీతో శివజ్యోతి ఓ ఖరీదైన ఇల్లు కొనుక్కుంది. అంతేకాదు, 2 రోజుల కిందట ఆ ఇంటికి షిప్ట్ అయింది కూడా. ఈ సందర్భంగా శివజ్యోతి కొత్తింట్లో బిగ్ బాస్ కంటెస్టెంట్లు మరోసారి సందడి చేశారు. తన కొత్త ఇంటి కోసం శివజ్యోతి దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చుచేసినట్టు తెలుస్తోంది. చూస్తుంటే.. చివరి వరకు హౌజ్ లో కొనసాగిన బిగ్ బాస్ కంటెస్టెంట్లకు బాగానే గిట్టుబాటు అయినట్టుంది.

|

Error

The website encountered an unexpected error. Please try again later.