అజ్ఞాతంలోకి అమలాపాల్

Amala Paul keeps silence on wedding pics
Monday, March 23, 2020 - 16:00

అమలాపాల్ ఇప్పుడెక్కడుంది
పెళ్లిపై ఆమె ఎప్పుడు క్లారిటీ ఇస్తుంది

ప్రస్తుతం ఈ రెండు విషయాలు బ్రహ్మపదార్థంగా తయారయ్యాయి. ఎందుకంటే.. అమలాపాల్ ఎక్కడుందనేది ఎవ్వరికీ తెలియదు, రెండోది రీసెంట్ గా బయటకొచ్చిన ఫొటోలతో అమలాపాల్ కు సంబంధం లేదంటున్నారు ఆమె ఫ్రెండ్స్.

ఇంతకీ మేటర్ ఏంటంటే.. భవ్నీందర్ సింగ్, అమలాపాల్ డేటింగ్ చేసుకున్న మాట వాస్తవమేనట. వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట. కానీ అంతలోనే ఆ రిలేషన్ షిప్ తెగిపోయిందంటున్నారు స్నేహితులు. ఆ డిప్రెషన్ తోనే అమలాపాల్ హిమాలయాలకు వెళ్లి ఉండొచ్చని చెబుతున్నారు. అయితే అంతలోనే భవ్నీందర్ సింగ్, అమలాపాల్ పెళ్లి చేసుకున్నట్టు ఫొటోలు రావడం మమ్మల్ని షాక్ కు గురిచేశాయని చెబుతున్నారు.

ఆ ఫొటోల్లో ఏదో మతలబు ఉందంటున్నారు అమలాపాల్ ఫ్రెండ్స్. అవి పెళ్లి ఫొటోలు కాకపోవచ్చని, అమలాపాల్ పై కోపంతో భవ్నీందర్ ఏవో ఫొటోల్ని అలా పోస్ట్ చేసి, ఆ వెంటనే డిలీట్ చేశాడని ఆమె ఫ్రెండ్స్ ఆరోపిస్తున్నారు. ఈ పిక్స్ బయటకొచ్చినప్పట్నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉంది అమలాపాల్. భవ్నీందర్ తో మాట్లాడిన తర్వాత ఆ ఫొటోలపై ఆమె క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది

|

Error

The website encountered an unexpected error. Please try again later.