పవన్ - హంసా మరాఠీ మాట

I speak in Marathi with Pawan Kalyan: Hamsa Nandini
Monday, May 25, 2020 - 19:45

పవన్ కళ్యాణ్ ది, తనది ప్రత్యేక బంధం అంటోంది హీరోయిన్ హంసా నందిని. టాలీవుడ్ లో చాలామంది హీరోలతో తనకు పరిచయాలు ఉన్నప్పటికీ పవన్ మాత్రం తనకు వెరీ వెరీ స్పెషల్ అంటోంది. ఎందుకంటే.. హంసానందిని మాతృభాష మరాఠీలో వీళ్లిద్దరూ మాట్లాడుకుంటారట. టాలీవుడ్ లో తనతో మరాఠీ మాట్లాడే ఏకైక వ్యక్తి పవన్ అంటోంది ఈ బ్యూటీ.

నిజానికి పవన్ సినిమాల్లో పెద్దగా కనిపించలేదు హంసానందిని. "అత్తారింటికి దారేది" సినిమాలో ఓ సాంగ్ లో మాత్రం ఇలా మెరిసి అలా మాయమౌతుంది. ఆ పాట వెనక సంగతుల్ని గుర్తుచేసుకుంది.

అప్పుడే అమెరికా నుంచి ఇండియాకొచ్చి నేరుగా సెట్స్ పైకి వచ్చేసిందట హంసానందిని. జెట్ లాగ్ కారణంగా నిద్రమత్తు అనిపించిందని, ఆరోజు పాటకు కూడా అదే అవసరమని చెప్పుకొచ్చింది. పైగా పగలంతా పడుకొని, రాత్రిళ్లు ఆ పాట కోసం షూట్ చేశామని.. తన అమెరికా టైమింగ్స్ ను అలా కంటిన్యూ చేశానని చెప్పుకొచ్చింది.

Hamsa Nandini

 ఆ అనుభవాలతో పాటు, పవన్ తో మరాఠీలో మాట్లాడ్డం తనకు మంచి అనుభూతి అంటోంది. మరోసారి పవన్ సినిమాలో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నానని తెలిపింది.

I speak in Marathi with Pawan Kalyan: Hamsa Nandini - పవన్ - హంసా మరాఠీ మాట |

Error

The website encountered an unexpected error. Please try again later.