అభిమానులు మారాల్సిందే!

NTR fans damaged his image with silly acts
Thursday, June 4, 2020 - 15:30

అభిమానులు చేసే పనులు కొన్నిసార్లు హీరోలకు అనవసర తలనొప్పులు తెచ్చిపెడుతుంటాయి. హీరో ఎన్టీఆర్ కి అదే జరిగింది. తారక్ ఇప్పుడు ఫామ్ లో ఉన్నాడు. ఇలాంటి టైంలో కొంతమంది ఫాన్స్ చేసిన పనికి రచ్చ జరుగుతోంది. 

సోషల్ మీడియాలోకి ఏ హీరో లేదా హీరోయిన్ వచ్చినా ఫ్యాన్స్ అంతా తమ అభిమాన హీరో గురించి అడగడం కామన్. అలా వచ్చిన స్టేట్ మెంట్ ను వైరల్ చేసుకుంటారు. అభిమానులకు అదొక ఆనందం. అయితే ఫేడ్ అవుటయిన మీరా చోప్రాను కూడా కెలికి, ఇప్పుడు తారక్ ఇమేజీకి భంగం కలిగేలా చేశారు ఫ్యాన్స్.

మీరా చోప్రాను ఎదో అడిగారు సరే.. సరైన రిప్లయ్ రానప్పుడు ఊరుకోవాలి కదా.. అలా చేయకుండా రెచ్చిపోయారు. దీంతో ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ పేరు నెగెటివ్ షేడ్ లో ప్రొజెక్ట్ అవుతోంది. ఒకప్పుడు పవన్ వీరాభిమానులు ఇలానే ఎక్కడపడితే అక్కడ పవన్ స్లోగన్స్ చెప్పి అతడి ఇమేజ్ కాస్త దెబ్బతీశారు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా వారి బాటనే పడుతున్నారా?

మీరా చోప్రా తారక్ ఎవరో తెలియదంటూ రియాక్ట్ అవ్వడం వాస్తవమే. ఈమాత్రం దానికే ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అవ్వడం ఎందుకు. ఇదే స్టేట్ మెంట్ కాజల్ ఇస్తే తప్పు, అనుష్క ఇస్తే తప్పు, సమంత ఇస్తే ఇంకా పెద్ద తప్పు. అసలు ఈ మీరా చోప్రా ఎవరు.. ఆమె ఎన్టీఆర్ ను గుర్తించాల్సిన అవసరం ఉందా? పోనీ కావాలనే గుర్తించలేదూ అనుకుందాం..... దానివల్ల యంగ్ టైగర్ రేంజ్ ఏమైనా పడిపోతుందా?

Meera Chopra

తెలుగులో "బంగారం" అనే సినిమా చేయడం వల్ల మాత్రమే ఈమెకు అంతోఇంతో గుర్తింపు వచ్చింది. అది కూడా అట్టర్ ఫ్లాప్ మూవీ. దాంతో పాటు ఆమె చేసిన ఏ ఒక్క సినిమా (గ్రీకువీరుడు, మారో) హిట్టవ్వలేదు. మీరా చోప్రాను సగటు తెలుగు ప్రేక్షకుడు మరిచిపోయి ఎన్నో ఏళ్లు అవుతోంది. అలాంటి హీరోయిన్ కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెలుగులో మళ్లీ ప్రచారం కల్పించారు. పనిలోపనిగా ఎన్టీఆర్ పేరును చెడగొట్టారు.

ఏ పని చేసినా విచక్షణతో చేయాలంటారు. సోషల్ మీడియా అభిమానుల్లో ఈ విచక్షణే కొరవడుతోంది. గుడ్డెద్దు చేలో పడినట్టు ఎవరో ఏదో పెడితే.. దాన్ని వీళ్లంతా వైరల్ చేయడం.. అదో గొప్పగా ఫీల్ అవ్వడం కామన్ అయిపోయింది. అందులో వాస్తవమెంత.. లాజిక్ ఏంటి.. అసలు రియాక్ట్ అవ్వాలా వద్దా అనే విషయాల్ని ఆలోచిస్తే అభిమానులు హీరోలకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు.

|

Error

The website encountered an unexpected error. Please try again later.