రిపీట్ చిత్రాలే బుల్లితెర టాప్-5

Telugu movies and TV ratings June 5, 2020
Thursday, June 11, 2020 - 16:15

స్మాల్ స్క్రీన్ పై ఈవారం (మే 30- జూన్ 5) వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్స్ సందడి పెద్దగా కనిపించలేదు. దీంతో రిపీటెడ్ మూవీసే కనిపించాయి. పైగా ఏ ఛానెల్ తమ ఫ్లాగ్ షిప్ సినిమాల్ని ఈ వారం ప్రసారం చేయలేదు. దీంతో ఊహించని సినిమాలు టాప్-5 జాబితాలోకి చేరాయి.

ఈ వారం ప్రసారమైన సినిమాల్లో నంబర్ వన్ పొజిషన్ లో నిలిచింది "ఎఫ్-2". స్టార్ మా ఛానెల్ లో 31వ తేదీన ప్రసారమైన ఈ సినిమాకు 4.99 (అర్బన్+రూరల్) టీఆర్పీ వచ్చింది. ఈ సినిమా తర్వాత "నరసింహనాయుడు", "90ml" సినిమాలు 2,3వ స్థానాల్లో నిలిచాయి.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన "అల్లాదీన్ (విల్ స్మిత్)" సినిమా నాలుగో స్థానంలో నిలిచింది. డిస్నీ సంస్థ  స్టార్ మా ఛానెల్ కొన్న తర్వాత  సూపర్ హిట్ హాలీవుడ్ మూవీస్ లైబ్రరీ దానికి దొరికింది. ఈమధ్య కాలంలో వాటన్నింటినీ వరుసగా ప్రసారం చేస్తూ మంచి రేటింగ్స్ సాధిస్తోంది ఈ సంస్థ. రీసెంట్ గా "ఎవెంజర్స్ ఎండ్ గేమ్"ను ప్రసారం చేసి బెస్ట్ రేటింగ్ అందుకున్న ఈ ఛానెల్, తాజాగా "అల్లాదీన్"తో కూడా చెప్పుకోదగ్గ  టీఆర్పీ సాధించింది.

ఈ సినిమాలు మినహా ఈ వారం చెప్పుకోదగ్గ మూవీస్ లేవు. ఆల్రెడీ సీరియల్స్ షూటింగ్స్ ప్రారంభం కావడంతో.. వచ్చే వారం నుంచి సినిమా రేటింగ్స్ ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.