నగ్నంగా నటించమన్నారు

Tejaswi says she faced casting couch experiences
Friday, June 12, 2020 - 18:45

బోల్డ్ గా మాట్లాడే తేజశ్వి మరోసారి అదే స్టయిల్ లో రియాక్ట్ అయింది. హిందీలో ఓ ఆఫర్ వచ్చిందని, అందులో న్యూడ్ సీన్ ఉందని, ఆ విషయం తనకు చెప్పకుండానే నగ్నంగా నటించమన్నారని చెప్పుకొచ్చింది.

"నవాజుద్దీన్ సిద్ధిఖీతో హిందీలో ఓ సినిమా చేయాలి. అందులో నాకు న్యూడ్ సీన్ ఉంది. మేకర్స్ దాన్ని చాలా లైట్ తీసుకున్నారు. వర్మ సినిమాలో నటించింది కదా నగ్నంగా చేసేస్తుందిలే అనుకున్నారు. వర్మ నన్ను ఛెస్ట్ వరకు చూపించాడు. తర్వాత కాళ్లు చూపించాడు. డ్రెస్ కిందకి తీస్తున్నట్టు చూపించాడు. నేను నగ్నంగా నటించానని అంతా అనుకున్నారు."

Latest Photos: Tejaswi Madivada

రెండేళ్ల కిందట వచ్చిన ఆ ఆఫర్ ను తను వదులుకున్నానని, కానీ ఇప్పుడు న్యూడ్ గా నటించమంటూ ఆఫర్ వస్తే ఒప్పుకుంటానని చెబుతోంది తేజశ్వి. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ దారుణంగా ఉందని.. కేవలం దాని వల్లే తన డేటింగ్ కూడా చెడిందని చెప్పుకొచ్చింది. ఓ వ్యక్తిని బాగా ఇష్టపడ్డానని, పెళ్లికి కూడా రెడీ అయిన టైమ్ లో కాస్టింగ్ కౌచ్ వల్ల ఆ సంబంధం తెగిపోయిందని గుర్తుచేసింది.

ఇండస్ట్రీలో చాలామంది తనను కమిట్ మెంట్ అడిగారని.. తను  మాత్రం ధైర్యంగా అన్నింటికీ నో చెప్పానని అంటోంది ఈ బోల్డ్ బ్యూటీ.

|

Error

The website encountered an unexpected error. Please try again later.