టీఆర్పీకి ప్రతి వారం పండగే!

Television ratings for the week June 13
Thursday, June 25, 2020 - 15:15

లాక్ డౌన్ గట్టిగా నడిచిన టైమ్ లో ప్రతి సినిమాకు రేటింగ్ వచ్చింది. సోమవారం-శనివారం అనే తేడా లేకుండా బుల్లితెరపై అన్ని సినిమాలు ఆడేశాయి. కానీ ఇప్పుడు లాక్ డౌన్ అనేది పేరుకు మాత్రమే. జనాలంతా ఎవరి పనుల్లో వాళ్లు పడ్డారు. దీంతో సినిమాలకు రేటింగ్స్ ఆటోమేటిగ్గా తగ్గాయి. ఒక విధంగా చెప్పాలంటే ఎప్పట్లానే వారాంతాల్లో ప్రసారమయ్యే సినిమాలకు మాత్రమే రేటింగ్స్ వస్తున్నాయి. ఈ వారం (జూన్ 13-19 వరకు) ఆ విషయం స్పష్టమైంది.

ఈ వారం టాప్-5 సినిమాల్లో "ప్రతిరోజూ పండగే", "90ఎంఎల్", "స్టైల్", "రూలర్", "ఎమ్మెల్యే" నిలిచాయి. ఆశ్చర్యకరంగా ఇవన్నీ 14వ తేదీ ఆదివారం ప్రసారమైన సినిమాలే. మిగతా రోజుల్లో ప్రసారమైన ఏ సినిమాకు రేటింగ్ రాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. "రంగస్థలం" లాంటి సినిమాలు టెలికాస్ట్ అయినప్పటికీ వీకెండ్ కాకపోవడంతో పెద్దగా టీఆర్పీలు రాలేదు.

ఇక నంబర్స్ పరంగా చూసుకుంటే.. ఈవారం కూడా మెగా కాంపౌండ్ హీరోదే అగ్రస్థానం. సాయితేజ్ నటించిన "ప్రతి రోజూ పండగే" సినిమాకు గరిష్టంగా 6.44 (అర్బన్) టీఆర్పీ వచ్చింది. తర్వాత స్థానాల్లో "90ఎంఎల్", "స్టైల్", "రూలర్" నిలిచాయి.

ఓవరాల్ గా చూసుకుంటే.. ఎప్పట్లానే స్టార్ మా ఛానెల్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగా.. రెండో స్థానంలో జెమినీ, మూడో స్థానంలో ఈటీవీ నిలిచాయి. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.