'ఆయన సేవలు అజరామరం'

Pawan Kalyan pays tribute to Raavi Kondala Rao
Tuesday, July 28, 2020 - 21:00

ప్రముఖ నటులు, రచయిత రావి కొండల రావు మరణం తీరని లోటు అని అన్నారు జన సేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన బహుముఖ సేవలు అజరామరం అని తెలిపారు పవన్ కళ్యాణ్.

"తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన‘పెళ్లి పుస్తకం’ చిత్రానికి కథా రచయితగా అందరి ప్రశంసలతోపాటు పలు పురస్కారాలు అందుకున్నారు. అన్నయ్య చిరంజీవి గారు చిత్రాలు మంత్రిగారి వియ్యంకుడు, చంటబ్బాయి లాంటి వాటిలో శ్రీ కొండలరావు గారు పోషించిన పాత్రలు అందరికీ గుర్తే. గత యేడాది ఒక పుస్తకావిష్కరణ సభలో వారిని కలిసినప్పుడు సినీ రంగ ప్రస్థానం, మలుపులు గురించి మాట్లాడుకున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను," అని అన్నారు పవన్ కళ్యాణ్. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.