ఉయ్యాలవాడ డైలాగ్స్ ఎలా ఉన్నాయో తెలుసా?

Superb dialogues for Chiru in Uyyalavada Narasimha Reddy
Tuesday, May 16, 2017 - 14:45

ఖైదీ నంబర్ 150 తో గ్రాండ్ హిట్ కొట్టిన చిరంజీవి తన 151వ సినిమాకు ప్రిపేర్ అవుతున్నాడు. ఓవైపు చిరంజీవి ఫుల్ గా గడ్డం పెంచి మేకోవర్ అవుతుంటే, మరోవైపు సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు అదిరిపోయే డైలాగ్స్ సెట్ అయినట్టు తెలుస్తోంది. 

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథ అందించారు. ప్రస్తుతం మరో ముగ్గురు రచయితలు ఈ సినిమాకు డైలాగ్స్ రాసే పనిలో బిజీగా ఉన్నారు. బుర్రా సాయిమాధవ్, మధు, వేమారెడ్డి కలిసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాకు వర్క్ చేస్తున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి చెబుతున్న సన్నివేశాలకు డైలాగ్ వెర్షన్స్ అందిస్తున్నారు. 

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాను లాంచ్ చేయబోతున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. మరోవైపు సినిమా కోసం హైదరాబాద్ లో భారీ సెట్ నిర్మాణం జోరుగా సాగుతోంది. 

|

Error

The website encountered an unexpected error. Please try again later.