టబుకి అందుకే పెళ్లి కాలేదట

అందాల టబు ఇపుడు ఆంటీ. 45 ఏళ్లు. ఆల్రెడీ తల్లి పాత్రల్లోకి వచ్చింది. ఇంకా పెళ్లి కాలేదు. అయితే తనకి పెళ్లి కాకపోవడానికి ఒక రీజన్ ఉందని ఒక మేటర్ బయటపెట్టింది. నాగార్జునని ప్రేమించి, ఆయనని పెళ్లి చేసుకోవాలనుకున్నా....అది కుదరలేదు కాబట్టి ఆమె అవివాహితగా ఉండిపోయిందని మీరు ఊహలు అల్లేసుకుంటున్నారా? ఆమె చెప్పింది అది కాదు.
అజయ్ దేవగన్ కారణంగానే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయింది (ట). కెరియర్ ప్రారంభంలోనే ఈ భామ అజయ్ దేవగన్ సరసన "విజయ్ పథ్" వంటి సినిమాలు చేసింది.
"అజయ్ నాకు మంచి స్నేహితుడు. ఎంత స్నేహం అంటే నాకు ఏమి కాకుండా కంటికి రెప్పలా కాపాడుకునేంతా. అజయ్, మరో మిత్రుడు సమీర్ నన్ను ఎపుడూ ఓ కంట కనిపెడుతుండేవారు. అబ్బాయిలు ఎవరూ నా దరిదాపుల్లోకి రాకుండా చూసుకునేవారు. నాకు ఎటువంటి సమస్య రావద్దనే ఉద్దేశంతో ఆ పని చేసేవారు. ఆ విధంగా అబ్బాయిలెవరూ నా దగ్గరికి ఎవరూ వచ్చి ప్రపోజ్ చేయలేదు. సో నాకు పెళ్లి కాకపోవడానికి అజయ్ దేవగణే కారణం.," అంటూ సరదాగా చెప్పింది.
బాలీవుడ్ తారలు ఇలాంటి కబుర్లు భలే చెపుతుంటారు. అసలు విషయం చెప్పాలంటే కష్టం కదా. అందుకే ఇలాంటి ఫన్నీ సమాధానాలు ఇస్తుంటారు. టబు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండానే మిగిలిపోవడానికి రీజన్ మాత్రం ఆమె ఇప్పట్లో బయటపెట్టే ఆలోచనలో లేనట్లుంది. బహుశా ఆ మేటర్ని ఆత్మకథలో బయటపెట్టేందుకు దాచి పెడుతుందేమో.
- Log in to post comments

























