2019: చీకటి గదిలో కాసుల వేట!

2019: Adult movies made money in Tollywood
Tuesday, December 31, 2019 - 17:30

2019లో ఏకంగా 183 స్ట్రయిట్ సినిమాలు, 72 డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో అన్ని రకాల జానర్స్ ఉన్నాయి. అయితే ఈసారి అడల్ట్ సినిమాల తాకిడి కూడా పెరిగింది. సెన్సార్ నిబంధనలు అనధికారికంగా కాస్త సడలించడంతో, ఈ తరహా సినిమాలు తీయడానికి ఎవ్వరూ వెనకాడ్డం లేదు. అలా 2019లో అటుఇటుగా ఓ పాతిక వరకు అడల్ట్ కంటెంట్ కోటింగ్ మూవీస్ వచ్చాయి. అయితే వాటిలో ది బెస్ట్ తీస్తే ఓ 10 సినిమాలు మిగుల్తాయి. ఆ టాప్-10లో నంబర్ వన్ స్థానం మాత్రం ఏడుచేపల కథ సినిమాదే.

ఏడు చేపల కథ సినిమాతో అభిషేక్ రెడ్డి కాస్తా టెంప్ట్ రవిగా మారిపోయాడు. ఇతడ్ని ఇప్పుడు టెంప్ట్ రవి అంటేనే ఎక్కువమంది గుర్తుపడతారు. అంతలా ఈ సినిమా పాపులర్ అయింది. దీనికి సెన్సార్ రాకపోతే చాలా కష్టపడి సెన్సార్ తెచ్చుకొని మరీ రిలీజ్ చేశారు. సి-సెంటర్లలో ఈ సినిమా మోస్ట్ ప్రాఫిటబుల్ వెంచర్ అనిపించుకుంది.

ఇక టాప్-10 అడల్ట్ మూవీ లిస్ట్ లో రెండో స్థానంలో నిలుస్తుంది చీకటిగదిలో చితక్కొట్టుడు. ఈ సినిమా కూడా ట్రయిలర్ తోనే పిచ్చెక్కించింది. ట్రయిలర్ తో పోలిస్తే, సినిమాలో కంటెంట్ కాస్త తక్కువగా ఉన్నప్పటికీ.. కొన్ని రసిక హృదయాలు మాత్రం ఈ సినిమాను బాగానే ఎంజాయ్ చేశాయి. ఆ మేరకు పైసా వసూల్ అనిపించుకుంది ఈ సినిమా.

ఇక లిస్ట్ లో మూడో స్థానంలో పాయల్ రాజ్ పుత్ నటించిన ఆర్డీఎక్స్ లవ్ నిలిచింది. కేవలం పాయల్ అందాలు, ఆ లిప్ కిస్సులు చూసేందుకే ఈ సినిమా కోసం కుర్రాళ్లు ఎగబడ్డారు. ఆ మేరకు వాళ్లను పాయల్ సంతృప్తిపరిచిందనే చెప్పాలి. కేవలం ఈ అడల్ట్ కంటెంట్ కారణంగానే ఈ మూవీకి ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. వీటితో పాటు రాయలసీమ లవ్ స్టోరీ, అగ్లీ, నేను లేను లాంటి సినిమాలు కూడా అడల్ట్ కంటెంట్ తో వచ్చి, కొందర్ని బాగానే కట్టిపడేశాయి

2019 టాప్-10 అడల్ట్ మూవీస్
1. ఏడు చేపల కథ
2. చీకటి గదిలో చితక్కొట్టుడు
3. ఆర్డీఎక్స్ లవ్
4. రాయలసీమ లవ్ స్టోరీ
5. అగ్లీ
6. రొమాంటిక్ క్రిమినల్స్
7. నేను లేను
8. 4 లెటర్స్
9. కొత్తగా మా ప్రయాణం
10. మాగ్నెట్