ఒక్క పాట కోసం రూ.3 కోట్లు ఖర్చు

3 crore set for Bellamkonda Srinivas Movie song
Thursday, July 20, 2017 - 16:00

స్టార్ హీరోల సినిమాలకు ఈమాత్రం ఖర్చు చేయడానికి నిర్మాత వెనకాడడు. కానీ ఇక్కడున్నది బెల్లంకొండ శ్రీనివాస్. ఈ హీరో సినిమా కోసం, కేవలం ఒక పాట కోసం 3 కోట్ల రూపాయల ఖర్చు అంటే ఆశ్చర్యపోవాల్సిందే. కానీ నిజం. జయజానకినాయక మూవీలో బీచ్ ఫెస్టివల్ సాంగ్ కోసం 3కోట్ల రూపాయల ఖరీదైన సెట్ వేశారు. 

విశాఖపట్నం సమీపంలో ఈ భారీ సెట్ ను నిర్మించారు. బీచ్ ఫెస్టివల్ నేపధ్యంలో ప్రేమ్ రక్షిత్ నేతృత్వంలో ఓ ఎనర్జిటిక్ నెంబర్ ను పిక్చరైజ్ చేయనున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్-ప్రగ్యాజైస్వాల్ మధ్య ఈ ఎనర్జిటిక్ అండ్ రోమాంటిక్ బీచ్ ఫెస్టివల్ సాంగ్ చిత్రీకరణ జరగనుంది. 500 మంది ఇండియన్ మరియు ఫారిన్ డ్యాన్సర్లతో అత్యంత భారీ స్థాయిలో చిత్రీకరించనున్న "డిస్కో బాబు డిస్కో బాబు" అనే పల్లవితో సాగే పాటకు యువ రచయిత శ్రీమణి సాహిత్యాన్ని సమకూర్చారు.
   
సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. సినిమాలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సరసన రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తోంది.