జల్దీ 5 విత్ ఈచులు

5 quick questions with Eesha Rebb
Sunday, April 19, 2020 - 14:45

హెడ్డింగ్ చూసి కన్ఫ్యూజ్ అవ్వొద్దు. తెలుగమ్మాయి ఈషా రెబ్బా ముద్దు పేరు అది. తనను ఇంట్లో అంతా ఈచులు అని పిలుస్తారనే విషయాన్ని బయటపెట్టింది ఈషా. ఈ మేటర్ తో పాటు ఈషా బయటపెట్టిన టాప్-5 ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం

1. నిక్ నేమ్  ఏంటి?
ఎక్కువమంది అంతా ఈషా అనే పిలుస్తారు. కానీ చాలా తక్కువమంది ఈచులు అని పిలుస్తారు. అదే నా నిక్ నేమ్.

2. ఏ హీరో బాగా ఇష్టం?
ఎన్టీఆర్ తో మరో సినిమా చేయాలని ఉంది. అందర్లానే నేను కూడా ఎన్టీఆర్ ఫ్యాన్. ఆయనతో మరో సినిమా చేసేందుకు వెయిటింగ్.

3. రెసిపీ లైవ్ ఎప్పుడు?
జనాలకు ఏదైనా మంచి రెసిపీ చూపించాలనుకుంటే అప్పుడు వంట స్టార్ట్ చేస్తానేమో. ఇప్పటివరకైతే నేను పెద్దగా వంట చేయలేదు. ఆన్ లైన్ లో మీ అందరి కోసం వంట చేయడమంటే అది చాలా కష్టమైన వ్యవహారం.

Also Check: Eesha Rebba Latest Gallery

4. తక్కువ సినిమాలు ఎందుకు?
చాలా సినిమాలు చేయాలని ఉంటుంది. కానీ వచ్చిన స్టోరీలన్నీ ఒప్పుకోలేం కదా. సినిమా చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ కారణమౌతాయి. అందుకే కొన్ని మూవీసే చేస్తున్నాను. ఏది పడితే అది చేయొచ్చు కానీ మంచివి చేస్తే బాగుంటుంది. అప్పుడే నాకు సంతృప్తి. ఏ సినిమా పడితే అది చేస్తే మళ్లీ మీరే అడుగుతారు.

5. లస్ట్ స్టోరీస్ గురించి.. 
"లస్ట్ స్టోరీస్" ను మార్చిలో రిలీజ్ చేయాయలనుకున్నారు. నలుగురు దర్శకులు తమ పని పూర్తిచేసిన తర్వాత మాత్రమే రిలీజ్ చేయాలనేది ప్లాన్. కానీ నాలుగో దర్శకుడు ఇంకా తన పని పూర్తిచేయలేదు. 3 స్టోరీలైతే అయిపోయాయి. నాలుగో దర్శకుడు ఇంకా చేయలేదనుకుంటున్నాను. అది నాకు డిఫరెంట్ ఇమేజ్ తీసుకొస్తుంది.