బుల్లితెరకు 90ML కిక్కు

90ML TV premiere gets good ratings
Thursday, May 14, 2020 - 15:15

కార్తికేయ చేసిన 90ml సినిమా థియేటర్లలో డిజాస్టర్ అయింది. ఈ సినిమాను చివరి వరకు భరించడం ప్రేక్షకుల తరం కాలేదు. అలాంటి సినిమా ఇప్పుడు సూపర్ హిట్టయింది. అవును.. 90ml సినిమాకు బుల్లితెరపై వీక్షకులు బ్రహ్మరథం పట్టారు.

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా ఛానెల్ లో 2వ తేదీన ప్రసారమైన ఈ సినిమాకు ఏకంగా 10.92 (అర్బన్) టీఆర్పీ రావడం విశేషం. నిజానికి ఆ ఛానెల్ జనాలు కూడా ఈ స్థాయి టీఆర్పీ ఊహించి ఉండరు. ఊహించని విధంగా ఈ సినిమా బుల్లితెర వీక్షకులకు కనెక్ట్ అయింది.

ఇక రేటింగ్స్ లో రెండో స్థానంలో సరైనోడు, మూడో స్థానంలో సంక్రాంతి సినిమాలు నిలవగా.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వచ్చిన లోకల్ బాయ్ నాలుగో స్థానంలో నిలిచింది. ధనుష్ నటించిన ఈ సినిమాకు (7.19 -అర్బన్) టీఆర్పీ వచ్చింది.

ఎప్పట్లానే ఈ వారం కూడా టాప్-5లో ఈటీవీ న్యూసే నిలిచింది. ఓవరాల్ గా ఈ వారం రేటింగ్స్ పరంగా జెమినీ ఛానెల్ టాప్ లో నిలిచింది. ఆ ఛానెల్ దగ్గరున్న మూవీ లైబ్రరీ ఈ లాక్ డౌన్ టైమ్ లో బాగా కలిసొచ్చింది. రెండో స్థానంలో స్టార్ మా నిలిచింది.