కటింగ్ చేసి డబ్బులు తీసుకున్న హీరో

Aadhi Pinishetty does haircut for dad
Tuesday, June 16, 2020 - 17:00

ఈ లాక్ డౌన్ టైమ్ లో సామాన్యులతో పాటు హీరోహీరోయిన్లకు సెలూన్ కష్టాలు తప్పలేదు. మరీ ముఖ్యంగా సెలూన్ల ద్వారా వైరస్ వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉండడంతో, ఆ జోలికి కూడా పోలేదు నటీనటులు. దీంతో చాలామంది హీరోలు జుట్టు, గడ్డం పెంచేశారు. మరికొంతమంది తమ కుటుంబ సభ్యులకు హెయిర్ కట్ చేసి మురిసిపోయారు. ఇప్పుడీ లిస్ట్ లోకి ఆది పినిశెట్టి కూడా చేరాడు.

తన తండ్రి రవిరాజా పినిశెట్టికి కటింగ్, షేవింగ్ చేశాడు ఆది పినిశెట్టి. అయితే అక్కడితో ఆగకుండా తండ్రిని కటింగ్ డబ్బులు అడిగాడు. దీంతో రవిరాజా పినిశెట్టి పర్స్ తీసి కొడుక్కి కటింగ్ డబ్బులు ఇవ్వగా.. అది చాలదంటూ తండ్రి నుంచి ఏకంగా పర్స్ తీసుకున్నాడు ఆది పినిశెట్టి.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తండ్రికి హెయిర్ కట్ చేయడానికి (బట్టతల కాబట్టి) ఆది పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఆయన ఎలా కటింగ్ చేశాడనే విషయాన్ని పక్కనపెడితే.. ఈ తండ్రికొడుకుల అనుబంధం మాత్రం ఈ వీడియో రూపంలో బయటపడింది.