ఎనిమిదో చేపను కూడా రెడీ చేశాడు

Abhishek Reddy's next Wife, I
Monday, November 11, 2019 - 16:45

ఏడు చేపల కథతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు హీరో అభిషేక్ రెడ్డి. ఆ సినిమాతో అనుకున్న టార్గెట్ ఆడియన్స్ ను రీచ్ అయ్యారు. అస్సలు ఆడదనుకున్న ఈ సినిమా సి-సెంటర్లలో సైలెంట్ గా ఆడుతోంది. ఈ ఉత్సాహంతో ఇప్పుడు మరో సినిమా సిద్ధం చేశాడు అభిషేక్. ఆ మూవీ పేరు వైఫ్, ఐ.

ఏడు చేపల కథతో అడల్డ్ సినిమాల్లో పీక్స్ చూపించిన అభిషేక్, తన కొత్త సినిమా వైఫ్-ఐతో కూడా అడల్ట్ సినిమాల్ని కొత్త పుంతలు తొక్కించబోతున్నాడు. ఏడు చేపల కథలో ఏడుగురు అమ్మాయిల్ని హాట్ గా చూపిస్తే, ఈ సినిమాతో ఎనిమిదో చేపను పరిచయం చేయబోతున్నారు. ఆమె పేరు సాక్షి నిదియా.

ఈ సినిమాను కూడా సెన్సారోళ్లు సిగ్గుపడుతూ చూశారంట. 2 సీన్లు మొత్తంగా లేపేశారట. ఇక తప్పదన్నట్టు A-సర్టిఫికేట్ ఇచ్చేశారు. సో.. అభిషేక్ మరోసారి థియేటర్లలోకి వస్తున్నాడు. రసికహృదయాలు రెడీనా.