ఆ పని వాయిదా వేసిన చిరు

Acharya title logo release postponed
Friday, March 27, 2020 - 19:15

లెక్కప్రకారం ఉగాది సందర్భంగా ఆచార్య టైటిల్ ను రివీల్ చేయాలి. ఈ మేరకు తెరవెనక అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. టైటిల్ డిజైన్స్ కూడా 2-3 తయారుచేయించి పెట్టుకున్నారు. అయితే అదే టైమ్ లో తను సోషల్ మీడియాలోకి వస్తున్నట్టు ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో ఆచార్య టైటిల్ ప్రకటన కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేసుకున్నారు.

నిజానికి సోషల్ మీడియాలో అడుగుపెడుతూనే, తన ఎకౌంట్ ద్వారా ఆచార్య లోగోను విడుదల చేయాలని చిరంజీవి ముందుగా అనుకున్నారు. అలా చేస్తే ఆచార్య కోసమే తను సోషల్ మీడియాలోకి వచ్చానని చాలామంది పొరపాటుపడే ఆస్కారం ఉండడంతో.. ఆచార్య లోగో రిలీజ్ ను వాయిదా వేశారు.

ఆచార్య లోగో డిజైన్ విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేయడానికి మరో రీజన్ కూడా చెబుతున్నారు. ఉగాది సందర్భంగా ఆర్ఆర్ఆర్ టైటిల్ రిలీజ్ చేశారు. అదే రోజున ఆచార్య టైటిల్ లోగోను కూడా రిలీజ్ చేస్తే పోటీ వాతావరణం ఏర్పడుతుందనే ఉద్దేశంతో వాయిదా వేసుకున్నారు.

ఇలా ఆచార్య టైటిల్ లోగో విడుదల జాప్యం వెనక చాలా కారణాలున్నాయి. త్వరలోనే ఓ మంచి రోజు చూసి ఆచార్య టైటిల్ డిజైన్ ను రిలీజ్ చేస్తారు.