న‌టి అన్న‌పూర్ణ‌మ్మ కూతురు ఆత్మ‌హ‌త్య‌

Actress Annapurnamma's daughter commits suicide
Saturday, July 28, 2018 - 16:00

ప్ర‌ముఖ న‌టి, త‌ల్లి పాత్ర‌ల‌కి పేరొందిన అన్న‌పూర్ణమ్మ‌ కూతురు ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అన్నపూర్ణ కూతురు కీర్తి ఆత్మహత్య చేసుకున్నారు. మాన‌సిక స‌మ‌స్య‌ల కార‌ణంగానే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారని అన్న‌పూర్ణ తెలిపారు. హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నివాసం ఉంటున్న కీర్తి పాప‌కి మాట‌లు రావ‌డం లేద‌ట‌.

"గత కొద్ది రోజులు గా పాప కి స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నాం.పాపకు ఇక మాటలు రావకొని కొద్ది రోజులుగా డిప్రెష‌న్‌లోకి వెళ్ళింది కీర్తి. ఆ డిప్రెష‌నే ఆత్మ‌హ‌త్య‌కి కార‌ణ‌మ‌,"ని అన్న‌పూర్ణ పోలీసుల‌కి తెలిపారు.

"ఈ రోజు తెల్లవారుజామున బెడ్ రూమ్ డోర్ తీయక పోవడంతో అనుమానం వచ్చి డోర్ పగులగొట్టి లోనికి వెళ్లి చూస్తే...ఉరి వేసుకొని కనిపించిందని," ఆమె పోలీసుల‌కి చెప్పారు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.