హేమ కాదు ఆమె కోళ్ల హేమ!

Actress Hema changes her name officially
Friday, May 5, 2017 - 19:30

హేమ గురించి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. సినిమాల్లో ఆమె పోషించే పాత్ర‌ల‌న్నీ దాదాపుగా ఆంటీ, అక్క‌, పిన్ని పాత్ర‌లే. అయితేనేమి, ఆమెకున్న మేల్ ఫాలోయింగ్ త‌క్కువేమీ కాదు. అంద‌మైన క్యార‌క్ట‌ర్ ఆర్టిస్ట్ కాబ‌ట్టి హీరోయిన్ల‌లాగే ఆమెకి పాపులారిటీ వ‌చ్చింది మ‌రి. స‌రే ఇపుడు మేట‌ర్ ఆమె అందం గురించి కాదు. ఆమె పేరు మారింద‌ని చెప్ప‌డ‌మే ఈ ప్ర‌య‌త్నం. 

ఆమె అస‌లు పేరు హేమ కాదు. ఆమె పేరు కృష్ణ‌వేణి. గోదావ‌రి జిల్లాల్లో పుట్టి పెరిగిన కృష్ణ‌వేణి సినిమా రంగంలో హేమ పేరుతో పాపుల‌ర్ అయింది. ఇపుడు ఆమె అధికారికంగా త‌న పేరుని హేమ‌గా మార్చుకొంది. కోళ్ల కృష్ణ‌వేణి ఇక అధికారికం గా కోళ్ల హేమగా మారిపోయింది. ఇక ఆమె అలాగే సైన్ చెయ్యొచ్చు.