లాక్డౌన్ లో వీళ్లు చేస్తున్న పని

Actresses are doing these things during lockdown
Sunday, April 12, 2020 - 16:15

ఈ లాక్ డౌన్ టైమ్ లో హీరోయిన్లంతా తమకు నచ్చిన పనులతో బిజీ అయిపోయారు. నభానటేష్ అయితే ఇంట్లో కూర్చొని రకరకాల మేకప్, ఫేషియల్స్ ట్రై చేస్తోంది. అవి కూడా పూర్తయిన తర్వాత తనకు నచ్చిన పుస్తకాలు చదువుకుంటోంది. అటు హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా అంతే. రోజుకో పుస్తకాన్ని నమిలేస్తోంది.

ఇక శృతిహాన్, కాజల్, కత్రినాకైఫ్ లాంటి హీరోయిన్లైతే పూర్తిగా వంటగదికే పరిమితం అయిపోయారు. నచ్చిన వంటకం చేసుకొని లాగించేస్తున్నారు. ఉదయం ఎక్సర్ సైజులు చేస్తూనే.. మధ్యాహ్నం అయ్యేసరికి నచ్చిన వంటకాలతో ఘుమఘుమలాడిస్తున్నారు.

ఇక సన్నీలియోన్ సంగతి అందరికీ తెలిసిందే కదా. క్వారంటైన్ టైమ్ లో కూడా కైపెక్కిస్తోంది ఈ ముద్దుగుమ్మ. గతంలో తను తీసుకున్న ఫొటోషూట్స్ లోంచి రోజుకు ఒకట్రెండు చొప్పున బయటకు వదుల్తోంది. హాట్ హాట్ ఫొటోలతో మతులు పోగొడుతోంది.

నిధి అగర్వాల్ తను ఇంట్లో ఉంటూనే అభిమానులతో యంగేజ్ అవుతోంది. ఇంట్లో తీసుకున్న పిక్స్ తో పాటు.. గతంలో దిగిన ఫొటో షూట్స్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఏ పిక్ రిలీజ్ చేసినా అందులో హాట్ నెస్ మిస్సవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

ఇక రకుల్ అయితే తనకు ఎంతో ఇష్టమైన ఎక్సర్ సైజులు చేస్తూ కాలం గడిపేస్తోంది. అటు శ్రద్ధాదాస్, పాయల్ రాజ్ పుత్ లాంటి హీరోయిన్లు గతంలో తాము తీసుకున్న ఫొటోల్ని మరోసారి గుర్తుచేస్తున్నారు. పాయల్ అయితే మధ్యమధ్యలో టిక్ టాక్ వీడియోస్ కూడా రిలీజ్ చేస్తోంది. ఇలా హీరోయిన్లంతా ఈ లాక్ డౌన్ టైమ్ లో తమ మనసుకు నచ్చిన పనులతో బిజీ అయిపోయారు.