బ్లాక్ అండ్ వైట్ బ్యూటీస్

Actresses post black and white photos
Monday, July 27, 2020 - 23:00

అందమైన హీరోయిన్ల ఫొటోలు ఎలా ఉంటాయి.. ఒక్క ముక్కలో చెప్పాలంటే కలర్ ఫుల్ గా ఉంటాయి. కన్నులవిందుగా ఉంటాయి. కొన్ని హాట్ ఫొటోలైతే గంటలకొద్దీ చూడాలనిపిస్తాయి.

అలా కలర్ ఫుల్ గా కనిపించే భామలంతా  బ్లాక్ అండ్ వైట్ లోకి మారిపోతున్నారు. ఇప్పుడు ఎవర్ని చూసినా అంతా బ్లాక్ అండ్ వైట్ లో కనిపిస్తున్నారు.

టాలీవుడ్ లో ఇదొక కొత్త ఛాలెంజ్. #womenlifteachother, #womensupportingwomen, #empoweringwomen, #blackandwhitechallenge లాంటి హ్యాష్ ట్యాగ్స్ తో ఇప్పుడిది సోషల్ మీడియాలో జోరుగా ట్రెండ్ అవుతోంది. మహిళా సాధికారత కోసం ఈ ట్రెండ్ నడుస్తోంది.

కాజల్లా, వణ్య త్రిపాఠి, రకుల్, ఉపాసన, సమంత, మంచు లక్ష్మి లాంటి హీరోయిన్లంతా బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు పెట్టడానికి ఇదే కారణం. నిజానికి ఇలా బ్లాక్ అండ్ వైట్ లో ఫొటోలు పెట్టడం ఇదే ఫస్ట్ టైమ్ కాదు. గతంలో ఓసారి కాన్సర్ పై అవగాహన కోసం హీరోయిన్లంతా ఇలా తమ ఫొటోల్ని బ్లాక్ అండ్ వైట్ లో పెట్టారు. ఇప్పుడు అదే ట్రెండ్ ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుంది.