పీకల్లోతు ప్రేమలో హాట్ బ్యూటీ

Adah Sharma dating a businessman
Wednesday, November 27, 2019 - 10:00

అదా శర్మ.. ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమే. హార్ట్ ఎటాక్ సినిమాతో ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో ఈమె పెద్దగా క్లిక్ అవ్వలేదు కానీ, బాలీవుడ్ లో మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. ఇలాంటి టైమ్ లో ఆమె డేటింగ్ చేస్తోందనే వార్తలు గుప్పుమన్నాయి.

సాధారణంగా నిప్పులేనిదే ఇలాంటి పుకార్లు రావు. అదా శర్మ విషయంలో కూడా అదే జరిగింది. ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తతో ఆమె షికార్లు కొడుతోంది. అడిగితే మాత్రం అలాంటిదేం లేదంటోంది. మరో అడుగు ముందుకేసి, ఆ వ్యాపారవేత్త ఎవరో తనకు తెలియదని బుకాయిస్తోంది.

డేటింగ్ రూమర్స్ ను హీరోయిన్లు ఖండించడం సర్వసాధారణం. అదా శర్మ ఎఫైర్ కూడా అలాంటిదే అంటోంది బాలీవుడ్ మీడియా. రీసెంట్ గా కృతి కర్బందా బయటపడినట్టు, కొన్నాళ్ల తర్వాత అదానే తన ప్రేమ విషయాన్ని బయటపెడుతుందని చెబుతోంది. అయితే అదా మాత్రం తనకు కాబోయే భర్త దోస, చట్నీ బాగా చేయాలని.. జంతుప్రేమికుడై ఉండాలని హింట్స్ ఇస్తోంది.