ఈ టాలెంట్ కూడా ఉందా?

Adah Sharma stuns with her pooja mode
Thursday, April 2, 2020 - 10:30

అదా శర్మ అనగానే ఓ సెక్సీ ఫిగర్ కళ్ల ముందు కదలాడుతుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా.. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే జనాలకు అదాలో కళల గురించి తెలుసు. ఆమె మంచి జిమ్నాస్ట్. రకరకాల యోగాసనాలు కూడా వేస్తుంది. తాజాగా తను కర్రసాము చేస్తున్న వీడియో కూడా పోస్ట్ చేసింది. ఇవన్నీ ఆమెను ఫాలో అయ్యేవాళ్లకు తెలుసు.

అయితే ఇప్పుడు తనలోని మరో కళను కూడా బయటకు తీసింది అదా శర్మ. ఎన్నడూలేని విధంగా పూజ గదిలో స్తోత్రాలు చదువుతూ కనిపించింది. అవును.. చక్కగా స్నానం చేసి పూజగదిలో దుర్గా స్తోత్రం పఠించింది. ఆ వీడియో చూసిన జనాలు అదాకు ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది అదా శర్మ. అయితే ఆ తర్వాత ఆమెకు ఫుల్ లెంగ్త్ హీరోయిన్ పాత్రలు పెద్దగా రాలేదు. సన్నాఫ్ సత్యమూర్తిలో గెస్ట్ రోల్ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత గరం, కల్కి సినిమాల్లో మాత్రమే కనిపించింది. అడపాదడపా హిందీలో చిన్నచిన్న పాత్రలు చేస్తున్న ఈ చిన్నది.. సిల్వర్  స్క్రీన్ కంటే సోషల్ మీడియాలోనే బాగా పాపులర్ అవుతోంది.