అదితి టు రాశి వయా రకుల్

Aditi Rao, Raashi Khanna and Rakul linked to Mahasamudram
Monday, July 6, 2020 - 14:15

సముద్రంలో కెరటాలు ఎలాగైతే ముందుకువెనక్కు జరుగుతుంటాయో.. "మహాసముద్రం" సినిమాలో హీరోయిన్ ఎవరనే అంశం కూడా అలానే సాగుతోంది. ముందుగా ఈ సినిమాలో అదితి రావు పేరు తెరపైకి వచ్చింది. ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ పేరు జోరుగా వినిపించింది. ఇప్పుడు కొత్తగా లిస్ట్ లోకి రాశిఖన్నా పేరు వచ్చి చేరింది.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే మహాసముద్రంలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉంది. ఈ మేరకు రాశి కూడా ఈమధ్య కొన్ని హింట్స్ ఇచ్చింది. త్వరలోనే ఓ క్రేజీ తెలుగు సినిమాలో నటించబోతున్నానంటూ ప్రకటించింది. ఆ క్రేజీ సినిమా ఇదే కావొచ్చంటున్నారు చాలామంది.

శర్వానంద్ హీరోగా అజయ్ భూపతి దర్శకత్వంలో రాబోతోంది "మహాసముద్రం" సినిమా. ఇందులో హీరోగా శర్వానంద్ నటించబోతున్నాడనే విషయాన్ని అజయ్ భూపతి ఆమధ్య ప్రకటించారు. మూవీలో మరో హీరో పాత్ర కూడా ఉంది. ఈ క్యారెక్టర్ కోసం సిద్దార్థ్ ను అనుకుంటున్నారు.