నచ్చకపోతే టచ్ చేయను: అదితి

Aditi Rao talks about love and relationships
Sunday, March 15, 2020 - 11:00

తనకు ఏదైనా మనసుకు నచ్చితేనే చేస్తానంటోంది హీరోయిన్ అదితిరావు. వస్తువులైనా, పనులైనా, మనుషులైనా తన మనసుకు నచ్చకపోతే టచ్ చేయనని చెబుతోంది. ప్రేమను కేవలం ఫిజికల్ గా చూడొద్దంటోంది అదితి. అది మనసుకు సంబంధించిన విషయమని.. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మనసుతో ముడిపడి ఉంటుందని చెబుతోంది. తనపై స్వచ్ఛమైన ప్రేమను కురిపించే వాళ్లపై ఆటోమేటిగ్గా అభిమానం పెరుగుతుందని చెబుతోంది.

కొంతమంది తనపై అధికారం, హోదా చూపించడానికి ప్రయత్నిస్తుంటారని.. అలాంటి వాళ్లకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తానంటోంది అదితి. అలా బిహేవ్ చేసే వ్యక్తులతో ఫిజికల్ గా, ఫ్రెండ్ షిప్ పరంగా చాలా దూరంగా ఉంటానంటోంది. ఇక ట్రోలింగ్స్ పై కూడా తనదైన శైలిలో స్పందించింది.

ట్రోలింగ్స్, గాసిప్స్ అనేవి ఎప్పటికప్పుడు తన దగ్గరకు వస్తుంటాయని.. కానీ వాటిని అలా విని ఇలా వదిలేస్తానని చెబుతోంది. తన మనసును గాయపరచనంతవరకు ఏ ట్రోలింగ్ ను పట్టించుకోనని, అలా గాయపరిచే విధంగా తన అభిమానులు ఎప్పుడూ ప్రవర్తించలేదని చెప్పుకొచ్చింది.

ఓ ఇంగ్లిష్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా తనలోని తాత్వికతను బయటపెట్టింది అదితిరావు. అయితే తన జీవితంలో తనను ఇబ్బందిపెట్టిన వ్యక్తుల గురించి మాత్రం అదితి చెప్పలేదు.