నా పుండుపై కారం చల్లొద్దు : శేష్

Adivi Sesh opens up about wedding news
Wednesday, August 7, 2019 - 08:15

మొన్నటికిమొన్న సందీప్ కిషన్ తన లవ్ ఎఫైర్లన్నీ బయటపెట్టాడు. అంతకంటే ముందు శ్రీవిష్ణు కూడా తన కాలేజ్ డేస్ లవ్ ఎఫైర్లు గురించి బయటపెట్టాడు. కానీ అడవి శేష్ మాత్రం వీళ్లలో ఓపెన్ అవ్వడం లేదు. ఇంకా చెప్పాలంటే కాస్త భయపడుతున్నాడు కూడా. తన ప్రేమ జీవితం గురించి చెప్పని  ఈ హీరో, పెళ్లి గురించి కూడా అడగొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాడు. 

"పెళ్లెప్పుడు చేసుకుంటావని మా అమ్మ నన్ను ఇంట్లో చంపేస్తోంది. ఇప్పుడు మీరు (యాంకర్) ఆ పుండు మీద ఉప్పు, కారం జల్లుతున్నారు. ఇప్పటివరకు నా పెళ్లి టాపిక్ నా ఇంటికే పరిమితం, ఇప్పుడు మీకు నేను రియాక్ట్ అయితే ఇది పబ్లిక్ టాపిక్ కూడా అయిపోతుంది. నా పెళ్లిపై నేనింకా క్లారిటీకి రాలేదు. ప్లీజ్ నన్ను వదిలేయండి."

"ఎవరు" అనే సినిమాను రిలీజ్ కు రెడీ చేశాడు అడవి శేషు. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా తన పెళ్లి, ప్రేమ విషయాలపై రియాక్ట్ అయ్యాడు. ప్రేమ లేదంటూ ఒక్క ముక్కలో తెగ్గొట్టిన శేష్, పెళ్లిపై మాత్రం ఇలా సుదీర్ఘంగా రియాక్ట్ అయ్యాడు. 

ఇప్పుడున్న హీరోయిన్లలో సమంత యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపిన శేష్, డాన్స్ లో మాత్రం సమంత కంటే సాయిపల్లవి అంటే చాలా ఇష్టమని తెలిపాడు. రౌడీ బేబీ సాంగ్ లో సాయిపల్లవి డాన్స్ చేస్తుంటే.. అలా చూస్తూ ఉండిపోయానని, ఎన్నిసార్లు చూశానో లెక్కలేదని అంటున్నాడు.