జూన్ వరకు ఆగాల్సిందేనా?

After effects of lockdown in Tollywood
Saturday, April 11, 2020 - 13:15

లాక్డౌన్ ఈ నెలాఖరు వరకు పొడిగించడం పక్కా. ప్రధాని మోదీ ఈ రోజో, రేపో అధికారికంగా ప్రకటించడం ఖాయం. మరి ఏప్రిల్ తోనే లాక్డౌన్ పూర్తవుతుందా అంటే ఇప్పుడే చెప్పలేం. ఒకవేళ మే నుంచి లాక్డౌన్ని దశలవారీగా ఎత్తేసినా, సినిమా షూటింగులకు వెంటనే అనుమతిస్తారా అనేది కూడా డౌటే. తాజా అంచనాల ప్రకారం అన్ని సర్దుకునే సరికి జూన్ పడుతుంది. 

ఆ తర్వాత అసలు సమస్య వస్తుంది. హీరోయిన్ల డేట్స్ చూసుకోవడం ఒక పెద్ద తలనొప్పి. పూజ హెగ్డే అటు ప్రభాస్ సినిమాల్లోనూ, ఇటు అఖిల్ నటిస్తున్న "మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్" సినిమాలో నటిస్తోంది. రెండు సినిమాలకి డేట్స్ కావాలంటే.. ఆమె షెడ్యూల్ ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. అలాగే ప్రకాష్ రాజ్, వెన్నెల కిశోర్ వంటి నటులు చాలా సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ఇదొక ట్రబుల్. 

కరోనా కన్నా ఇదే పెద్ద సమస్య కానుంది నిర్మాతలకి. టాలీవుడ్ ఇంతకుముందు ఎన్నో సంక్షోభాలని చూసింది, స్ట్రైక్ లని కూడా ఎదుర్కొంది. ఇదో కొత్త అనుభవం.